ప్రేమలో గెలవాలంటే... | Love   Win ... | Sakshi
Sakshi News home page

ప్రేమలో గెలవాలంటే...

Mar 20 2014 1:07 AM | Updated on Sep 2 2017 4:55 AM

ప్రేమలో  గెలవాలంటే...

ప్రేమలో గెలవాలంటే...

తొలి చూపులోనే ఆ యువతిపై మనసు పారేసుకుంటాడతను. ఓ శుభముహూర్తాన ‘ఐ లవ్ యు’ కూడా చెప్పేస్తాడు.

తొలి చూపులోనే ఆ యువతిపై మనసు పారేసుకుంటాడతను. ఓ శుభముహూర్తాన ‘ఐ లవ్ యు’ కూడా చెప్పేస్తాడు. కానీ, తన మనసు గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక కార్యం చేయాలని ఆమె ఓ నిబంధన విధిస్తుంది..

మరి.. ఆమె కోరికని నెరవేర్చి, ప్రేమను పొందగలిగాడా? లేదా? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఎదిర్ నీచల్’. శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా తమిళ హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు తెలుగులోకి అనువదించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. ఈ నెల 29న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ -‘‘జీవితంలో ఆశావహ దృక్పథంతో ఉంటే అన్నీ సాధించగలుగుతామని చెప్పే చిత్రం ఇది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్‌లతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది.


ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ అద్భుతంగా నటించారు. అనిరుథ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement