కలిసుందాం...! | love states audio released | Sakshi
Sakshi News home page

కలిసుందాం...!

Feb 17 2015 11:14 PM | Updated on Sep 2 2017 9:29 PM

కలిసుందాం...!

కలిసుందాం...!

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో అపోహలు ఉండకూడదనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లవ్ స్టేట్స్’.

 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో అపోహలు ఉండకూడదనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లవ్ స్టేట్స్’. ఉపేన్, అంబికా, తాన్యాశర్మ హీరోహీరోయిన్లుగా హెజెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్విత ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికిశ్రవణ్ కుమార్ దర్శకుడు. ప్రసాద్‌రెడ్డి, పుట్టగుంట సతీష్ నిర్మాతలు. పవన్ శేష సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సీడీ ఆవిష్కరించి, రెండు రాష్ట్రాల ప్రజల మనసులు ఎప్పుడూ కలిసి ఉండాలన్న సందేశంతో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలన్నారు. మరో అతిథి శివాజీ మాట్లాడుతూ - ‘‘రెండు తెలుగు రాష్ట్ర ప్రభు త్వాలు చిన్న చిత్రాలకు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది’’ అన్నారు.  ‘‘సంగీత దర్శకుడు చక్రి లేని లోటును పవన్ తీరుస్తారు. చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అని  దర్శకుడు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇందులో ఐదు పాటలున్నాయి. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయినప్పటికీ బాగా నటించారు’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement