breaking news
Love States
-
కలిసుందాం...!
తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో అపోహలు ఉండకూడదనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లవ్ స్టేట్స్’. ఉపేన్, అంబికా, తాన్యాశర్మ హీరోహీరోయిన్లుగా హెజెన్ ఎంటర్టైన్మెంట్స్, అన్విత ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికిశ్రవణ్ కుమార్ దర్శకుడు. ప్రసాద్‌రెడ్డి, పుట్టగుంట సతీష్ నిర్మాతలు. పవన్ శేష సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సీడీ ఆవిష్కరించి, రెండు రాష్ట్రాల ప్రజల మనసులు ఎప్పుడూ కలిసి ఉండాలన్న సందేశంతో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలన్నారు. మరో అతిథి శివాజీ మాట్లాడుతూ - ‘‘రెండు తెలుగు రాష్ట్ర ప్రభు త్వాలు చిన్న చిత్రాలకు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది’’ అన్నారు. ‘‘సంగీత దర్శకుడు చక్రి లేని లోటును పవన్ తీరుస్తారు. చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అని దర్శకుడు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇందులో ఐదు పాటలున్నాయి. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయినప్పటికీ బాగా నటించారు’’ అన్నారు. -
ముక్కోణపు ప్రేమలో క్రైమ్
మోడల్ ఉపేన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ముక్కోణపు ప్రేమకథతో ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టేట్స్’. శ్రవణ్‌కుమార్ నల్లా దర్శకుడు. అంబికా సోనీ, తాన్యా శర్మ కథానాయికలు. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘బూచమ్మ బూచోడు’ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో ‘లవ్ స్టేట్స్’ చేస్తున్నాం. ఇదో క్రైమ్ లవ్‌స్టోరీ. నూతన సంగీతదర్శకుడు పవన్ పాటలు ప్రత్యేక ఆకర్షణ. వచ్చే నెల 20న రిలీజ్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్.