ప్రేమలో పడిపోయారు.. | Love   Falling .. | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడిపోయారు..

Mar 23 2014 12:54 AM | Updated on Sep 2 2017 5:01 AM

ప్రేమలో  పడిపోయారు..

ప్రేమలో పడిపోయారు..

‘‘దర్శకుడు రవి చావలి ‘సామాన్యుడు’ సినిమాలో మా నాన్న సాయికుమార్ పాత్రను చాలా విభిన్నంగా చూపించారు.

‘‘దర్శకుడు రవి చావలి ‘సామాన్యుడు’ సినిమాలో మా నాన్న సాయికుమార్ పాత్రను చాలా విభిన్నంగా చూపించారు. ఇందులో నా పాత్ర కూడా  వైవిధ్యంగా ఉంటుంది. రెగ్యులర్ ప్రేమ కథల్లా కాకుండా సరికొత్త ప్యార్‌ని ఇందులో ఆవిష్కరించారు’’ అని ఆది చెప్పారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.



ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థలో ఇది నాలుగో సినిమా. కులుమనాలిలో త్వరలో చిత్రీకరించబోయే రెండు పాటలతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఇది మ్యూజికల్ లవ్‌స్టోరీ అని దర్శకుడు పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అని ఛాయాగ్రాహకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ కృష్ణారెడ్డి, కళా దర్శకుడు రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్మెస్ కుమార్ మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement