అమ్మ కోసం ఆరాధ్య ఏం చేసిందంటే.. | Like Mother Like Daughter! You'll Not Believe What Aaradhya Bachchan Did For Aishwarya Rai Bachchan | Sakshi
Sakshi News home page

అమ్మ కోసం ఆరాధ్య ఏం చేసిందంటే..

Mar 22 2016 6:32 PM | Updated on Sep 3 2017 8:20 PM

అమ్మ కోసం ఆరాధ్య ఏం చేసిందంటే..

అమ్మ కోసం ఆరాధ్య ఏం చేసిందంటే..

అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య అమ్మ చేత కంటతడి పెట్టించింది. అయితే అది పట్టలేనంత సంతోషంతో.

అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య అమ్మ చేత కంటతడి పెట్టించింది. అయితే ఆ కంటతడి పట్టలేనంత సంతోషంతో వచ్చింది. ఇటీవల 'సరబ్జిత్' షూటింగ్లో బిజీగా ఉంటున్న ఐశ్వర్య కాస్త అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో ఆమె బాధపడుతుండటంతో సరబ్జిత్ షూటింగ్కు ఓ వారం రోజులు విరామం ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రతిరోజూ ఆరాధ్య స్కూలు వదిలే సమయానికి వెళ్లి తనను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. తల్లి ఆరోగ్యాన్ని రెండు రోజులుగా గమనిస్తున్న ఆరాధ్య స్కూల్లో విరామ సమయంలో 'గెట్ వెల్ సూన్' కార్డు తయారు చేసిందట.

ఎప్పటిలానే సాయంత్రం అమ్మ స్కూల్ గేట్ వద్దకు రాగానే తన చిట్టి చిట్టి చేతులతో తయారుచేసిన 'గెట్ వెల్ సూన్' కార్డును అమ్మకిచ్చిందట. అంతే ఐశ్వర్య ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలను తీసుకెళ్లడానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఇతర తల్లిదండ్రులు కూడా ఆరాధ్య ఆలోచనకు తెగ ముచ్చటపడ్డారు. ఆరాధ్య విషయంలో నేను చాలా అదృష్టవంతురాలినంటూ మురిసిపోతుంది ఐశ్వర్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement