క్రీస్తు జీవితం... | Life of Jesus | Sakshi
Sakshi News home page

క్రీస్తు జీవితం...

Oct 15 2015 1:43 AM | Updated on Sep 3 2017 10:57 AM

క్రీస్తు జీవితం...

క్రీస్తు జీవితం...

ఏసుక్రీస్తు జీవితాన్ని సరికొత్త కోణంలో తెరపై ఆవిష్కరించడానికి రూపొందుతోన్న చిత్రం ‘తొలి కిరణం’.

ఏసుక్రీస్తు  జీవితాన్ని సరికొత్త కోణంలో తెరపై ఆవిష్కరించడానికి రూపొందుతోన్న చిత్రం ‘తొలి కిరణం’. సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. పీడీ  రాజు, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితాన్ని మరోసారి తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకుల హృదయాల్లో ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అని చెప్పారు. క్రిస్‌మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ-పాటలు: టి.ఎ ప్రభుకిరణ్ , రచనా సహకారం: వి.ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ.
 

Advertisement
 
Advertisement
Advertisement