బొబ్బిలిలో...ప్రేమ | Life is Beautiful 'fame Sudhir komakula movie | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో...ప్రేమ

Published Sat, Feb 7 2015 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

బొబ్బిలిలో...ప్రేమ

‘‘ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు వరా ముళ్లపూడి అన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధీర్ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్. ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి. అనిల్‌కుమార్‌రాజు, జి.వంశీకృష్ణలు  నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ బొబ్బిలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో నెలరోజుల పాటు జరిగే షూటింగ్‌తో టాకీ పార్టు పూర్తవుతుంది’’అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: శివశక్తి దత్తా, అనంతశ్రీరామ్, మాటలు: అనురాధ ఉమర్జీ, కెమెరా: ఎస్.డి. జాన్.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement