న్యూజిలాండ్‌ ప్రేమకథ | 'Life Is Beautiful' Fame Abhijit's '7 adugudulu | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ ప్రేమకథ

Jul 10 2017 12:41 AM | Updated on Sep 5 2017 3:38 PM

న్యూజిలాండ్‌ ప్రేమకథ

న్యూజిలాండ్‌ ప్రేమకథ

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేమ్‌ అభిజిత్‌ హీరోగా తెరకెక్కనున్న ‘7 అడుగులు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేమ్‌ అభిజిత్‌ హీరోగా తెరకెక్కనున్న ‘7 అడుగులు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. న్యూజిలాండ్‌లో పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్, యాడ్‌ ఫిలింస్‌ రూపొందించిన సంతోష్‌ తుక్కాపురం ఈ చిత్రానికి దర్శకుడు. మోక్ష మూవీస్‌ పతాకంపై తాన్యా ఆర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో వెంకటరమణ మెట్ట, తాన్యా మెహ్రా నిర్మిస్తున్నారు.

తెలంగాణ ఎంపీ కవిత ‘7 అడుగులు’ టైటిల్‌ లోగో ఆవిష్కరించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన కథతో సాగే చిత్రమిది. న్యూజిలాండ్‌లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రంలో మన సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నాం. న్యూజిలాండ్‌లో మొత్తం షూటింగ్‌ జరుపుకోనున్న తొలి సినిమా మాదే. సెప్టెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించి, నవంబర్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇదొక న్యూజిలాండ్‌ బేస్డ్‌ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ’’ అన్నారు సంతోష్‌. ‘‘ఈ సినిమా నాకు ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అంత పేరు తెస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు అభిజిత్‌. సంగీత దర్శకుడు కె.ఎమ్‌. రాధాకృష్ణ, కెమెరామేన్‌ ధీరజ్‌ తమ్మినేని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement