ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ చవితి కానుక | Lava kumar teaser released from Jai lava kusa movie | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ చవితి కానుక

Aug 24 2017 6:11 PM | Updated on Sep 12 2017 12:56 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'.



సాక్షి, హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'. లవ టీజర్‌ నేడు విడుదల చేసి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ చవితి కానుక అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావటంతో వినాయక చవితి పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం లవ టీజర్ ను రిలీజ్ చేశారు. లవ పాత్రలో ఎన్టీఆర్ చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు.

47 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో 'మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తలకిందులు చేసిందని' ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్‌గా డైలాగ్ చెప్పడం ఆ పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ షూటింగ్ జరుపుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement