సరికొత్త కామెడీ థ్రిల్లర్ | latest Comedy thriller | Sakshi
Sakshi News home page

సరికొత్త కామెడీ థ్రిల్లర్

Dec 12 2014 10:23 PM | Updated on Sep 2 2017 6:04 PM

సరికొత్త కామెడీ థ్రిల్లర్

సరికొత్త కామెడీ థ్రిల్లర్

సత్య సింహా, రుచిక, రాజ్‌పుత్, హారిణి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది.

సత్య సింహా, రుచిక, రాజ్‌పుత్, హారిణి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. దాసరి గంగాధర్ దర్శకుడు. గోపూజి కిరణ్ నిర్మాత. ఈ చిత్రం ముహూర్తపు దృశ్యానికి వ్యాపారవేత్త శ్రీరంగం సత్య కెమె రా స్విచాన్ చేయగా, సీనియర్ దర్శకుడు వి.సాగర్ క్లాప్ కొట్టారు. శిరీష్ భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు.

సరికొత్త కామెడీ థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: కార్తీక్ నాయుడు శనక్కాయల, సహ నిర్మాత: పెండ్యాల చక్రవర్తి, లైన్ ప్రొడ్యూసర్: పిట్ల పాండు, సమర్పణ: డి.ఎం.ఎం.సదన్.
 

Advertisement
 
Advertisement
Advertisement