ఆఫీసర్‌ ఝాన్సీ

Lakshmi Rai makes a comeback in Sandalwood - Sakshi

దాదాపు ఆరేళ్ల తర్వాత శాండిల్‌వుడ్‌ నుంచి రాయ్‌లక్ష్మీకి మళ్లీ కబురొచ్చింది. 2012లో ఉపేంద్ర నటించిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మీ. రాఘవ లారెన్స్‌ ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌ ఇది. ఇప్పుడు పీఎస్‌వీ గురుప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందనున్న కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమా ఆగస్టు 29న సెట్స్‌పైకి వెళ్తుందట.

‘‘ఇందులో సొసైటీలోని సమస్యలపై పోరాడే నిజాయతీ గల ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఝాన్సీ పాత్రలో రాయ్‌లక్ష్మీ నటించనున్నారు. ఓన్లీ యాక్షన్‌ మాత్రమే కాదు. లవ్‌ అండ్‌ సెంటిమెంట్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి. కంఫర్ట్‌ జోన్‌ని దాటి ఆమె ఈ సినిమాను ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘కన్నడ ఫిల్మ్‌ ‘ఝాన్సీ’లో నటించబోతున్నందుకు హ్యాపీ. తొలిసారి ఫుల్‌ యాక్షన్‌ రోల్‌ ట్రై చేయబోతున్నాను’’ అన్నారు రాయ్‌లక్ష్మీ. ఈ సినిమాకు రాజేష్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top