హీరోయిన్‌పై కుష్బూ విమర్శలు... | kusboo critisize the heroien shruti hassan | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌పై కుష్బూ విమర్శలు...

Jul 18 2017 7:55 PM | Updated on Sep 5 2017 4:19 PM

హీరోయిన్‌పై కుష్బూ విమర్శలు...

హీరోయిన్‌పై కుష్బూ విమర్శలు...

హీరోయిన్‌ శ్రుతీహాసన్పై కాంగ్రెస్‌ మహిళా నేత, సీనియర్‌ నటి కుష్భూ విమర్శల దాడి చేశారు

హీరోయిన్‌ శ్రుతీహాసన్పై  కాంగ్రెస్‌ మహిళా నేత, సీనియర్‌ నటి కుష్భూ విమర్శల దాడి చేశారు. దర్శకుడు సుందర్.సీ నటి కుష్భూ భర్త అన్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ తాజాగా సంఘమిత్ర అనే భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరక్కించడానికి రెడీ అయ్యారు. జయం రవి, ఆర్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించాడానికి మొదట అంగీకరించిన సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమా లోగోనూ కూడా ఫ్రాన్స్‌లో జరిగిన కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించిన సంగతి విదితమే.ఈ వేడుకలో సంఘమిత్ర యూనిట్‌తో పాటు నటి శ్రుతి పాల్గొన్నారు.

అనంతరం సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు అనూహ్యంగా ప్రకటించిన శ్రుతిహాసన్‌ కొన్ని ఆరోపణలు కూడా చేసి సంచలనం సృష్టించారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఆలస్యంగానైనా స్పందిచారనుకోండి. ఆ సమస్య సద్దుమణిగిందకున్న తరుణంలో తాజాగా కుష్బూ తన ట్విట్టర్‌లో శ్రుతిని మర్మగర్భంగా విమర్శించటం టాక్ ఆఫ్ ది  టాక్‌గా మారింది. ఇంతకీ కుష్బూ ఏమన్నారో చూద్దాం.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జేట్ తో తెరకెక్కనున్న చిత్రం సంఘమిత్ర. అలాంటి చిత్రాన్ని సరైన ప్లానింగ్ లేకుండా  ఎవరూ నిర్మించరు.

అసలు  స్కిప్టే లేదని కొందరు ఏవేమో సాకులు చెబుతున్నారు. నిజానికి సంఘమిత్ర చిత్రం ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. అందువల్ల  వృత్తిపై అవగాహన లేని వారే అసత్యాలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలకు షూటింగ్ అన్నది 30 శాతమే ఉంటుంది. మిగిలిన 70 శాతం  ఫ్రీ ప్రొడక‌్షన్లోనే జరుగుతుంది. మీ లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం సమస్య కాదు. వారసత్వంగా నటన వైపు వచ్చిన వాళ్ల  వృత్తిలో పరిణితిని ఎదురు చూస్తారు. మీలోని తప్పులను గ్రహించి, లోపాలను సరిదిద్దుకున్నప్పుడే సుదీర్ఘ పయనం చేయగలరు. ఇది నటి ఇది నటి కుష్బూ ట్విట్టర్‌లో పేర్కొన్న సారాంశం. మరి ఆమె విమర్శలకు శ్రుతి ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement