అర్జున్‌@150 | 'Kurukshetra film is going to be released in July | Sakshi
Sakshi News home page

అర్జున్‌@150

May 30 2017 12:09 AM | Updated on Sep 5 2017 12:17 PM

అర్జున్‌@150

అర్జున్‌@150

ఒక హీరో వంద సినిమాలు చేయడమంటేనే గ్రేట్‌. అటువంటిది యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ 150 సినిమాల అరుదైన మైలురాయిని చేరుకోవడం సో గ్రేట్‌.

ఒక హీరో వంద సినిమాలు చేయడమంటేనే గ్రేట్‌. అటువంటిది యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ 150 సినిమాల అరుదైన మైలురాయిని చేరుకోవడం సో గ్రేట్‌. ఈ 150వ చిత్రం మూడు భాషల్లో తెరకెక్కుతోంది. అర్జున్‌ హీరోగా అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి తెలుగులో ‘కురుక్షేత్రం’, తమిళంలో ‘నిబుణన్‌’, కన్నడలో ‘విస్మయ’ టైటిల్స్‌ ఫిక్స్‌ చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ –‘‘అర్జున్‌ ఇప్పటి వరకూ  చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఇందులో పోషించారు. ఊహకందని మలుపులు, ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్‌ మూవీలో ఆయన ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తెలుగు టీజర్‌ను అతి త్వరలోనే విడుదల చేసి, సినిమాను జూలైలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. వరలక్ష్మి శరత్‌ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ: అరవింద్‌ కృష్ణ, నిర్మాణం: ప్యాషన్‌ స్టూడియోస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement