'ఏంజిల్'గా కుమారి | kumari 21f fame hebha patel next movie with naganvesh | Sakshi
Sakshi News home page

'ఏంజిల్'గా కుమారి

May 21 2016 4:46 PM | Updated on Sep 4 2017 12:37 AM

'ఏంజిల్'గా కుమారి

'ఏంజిల్'గా కుమారి

అలా ఎలా సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన హేబాపటేల్ తరువాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించిన...

అలా ఎలా సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన హేబాపటేల్ తరువాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించిన ఈ బ్యూటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత మరోసారి రాజ్ తరుణ్ సరసన నటించిన ఆడో రకం ఈడోరకం సినిమా కూడా సక్సెస్ సాధించటంతో ఇక హేబాకు వరుస అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అలా జరగలేదు. సీనియర్ హీరోల సరసన సూట్ అవ్వకపోవటంతో పాటు యంగ్ హీరోల సరసన నటించడానికి భారీ పోటి ఉండటంతో పెద్దగా అవకాశాలు రాలేదు.

ఆడోరకం ఈడోరకం తరువాత యంగ్ హీరో నాగాన్వేష్ సరసన హీరోయిన్గా నటిస్తుంది హేబా. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయిన నాగాన్వేష్ తరువాత వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. రాజమౌళి దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏంజిల్ అనే టైటిల్ను ఫైనల్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement