హాట్ హీరోతో కృతి | kriti kharbanda romance with imran hasmi | Sakshi
Sakshi News home page

హాట్ హీరోతో కృతి

Nov 21 2015 11:29 AM | Updated on Sep 3 2017 12:49 PM

సౌత్ ఇండస్ట్రీలో పక్కింటి అమ్మాయిలా అలరిస్తున్న కృతి కర్బంద, బాలీవుడ్లో మాత్రం హద్దు మీరుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రల్లో...

సౌత్ ఇండస్ట్రీలో పక్కింటి అమ్మాయిలా అలరిస్తున్న కృతి కర్బంద, బాలీవుడ్లో మాత్రం హద్దు మీరుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రల్లో మాత్రమే చేసిన ఈ భామ, రాజ్ సీరీస్లోనటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో కలిసి రాజ్ 4లో నటించడానికి అంగీకరించింది ఈ బ్యూటి.

ఇమ్రాన్ హష్మీ సినిమాకు బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ హీరో సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఘాటు ముద్దు సీన్లు, హాట్ బెడ్రూం సీన్లు తప్పకుండా ఉండేలా చూస్తారు దర్శకనిర్మాతలు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ భామలే, ఈ హీరోతో నటించారు కనుక సౌత్ జనాలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే కృతి లాంటి హోమ్లీ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీతో నటిస్తుండటంతో ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement