ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం : మహేశ్‌బాబు | Krishna Gaadi Veera Prema Gaadha Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం : మహేశ్‌బాబు

Jan 21 2016 10:53 PM | Updated on Sep 3 2017 4:03 PM

ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం : మహేశ్‌బాబు

ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం : మహేశ్‌బాబు

ఈ చిత్రంలో నటించిన చిన్నారులు బాగున్నారు. బాగా నచ్చారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నా సొంత సంస్థ లాంటిది.

‘‘ఈ చిత్రంలో నటించిన చిన్నారులు బాగున్నారు. బాగా నచ్చారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నా సొంత సంస్థ లాంటిది. ఈ చిత్ర నిర్మాతలు డెడికేషన్ ఉన్నవారు.  ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం’’ అని హీరో మహేశ్ బాబు అన్నారు. నాని, మెహరీన్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మహేశ్‌బాబు విడుదల చేశారు.
 
  మహేశ్ మాట్లాడుతూ - ‘‘నాని నటించిన  ‘భలే భలే మగాడివోయ్’ చూశాను. అవుట్ స్టాండింగ్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు’’ అని అభినందించారు. ‘‘ఏడాది క్రితం మేము తెలిసీ, తెలియక చేసిన తప్పుల వల్ల మా సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. మాతో వర్క్ చేసిన హీరోలు, నటీనటులు, టెక్నీషియన్స్ మేం చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నారు. నాని ఈ సినిమా విషయంలో మాకు మంచి సపోర్ట్ అందించాడు.
 
  ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర చెప్పారు. ‘‘హను రాఘవపూడి సినిమా పిచ్చోడు. ఈ చిత్రం జర్నీలో నాకో బ్రదర్‌లా మారాడు. నిర్మాతలు అసిస్టెంట్ డెరైక్టర్స్‌లా పనిచేశారు’’ అని హీరో నాని పేర్కొన్నారు.  దర్శకుడు సుకుమార్, హీరోయిన్ మెహరీన్, హీరోలు ‘అల్లరి’ నరేశ్, అవసరాల శ్రీనివాస్, ఛాయాగ్రాహకులు రత్నవేలు, యువరాజ్, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement