నాగభరణం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ | Kodi Ramakrishna Nagabharanam Trailer | Sakshi
Sakshi News home page

నాగభరణం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

Sep 20 2016 2:04 PM | Updated on Sep 4 2017 2:16 PM

నాగభరణం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

నాగభరణం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో గ్రాఫికల్ వండర్స్ తెరకెక్కించాలంటే దర్శకుడిగా రాజమౌళి పేరునే సూచిస్తారు. అయితే రాజమౌళి కన్నా ముందే తెలుగు సినిమాకు అద్భుతమైన గ్రాఫిక్స్ను పరిచయం చేసిన...

ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో గ్రాఫికల్ వండర్స్ తెరకెక్కించాలంటే దర్శకుడిగా రాజమౌళి పేరునే సూచిస్తారు. అయితే రాజమౌళి కన్నా ముందే తెలుగు సినిమాకు అద్భుతమైన గ్రాఫిక్స్ను పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు సినిమాతో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ చూపించిన కోడి, అంజి సినిమా గ్రాఫిక్స్కు జాతీయ అవార్డ్ను కూడా సాధించాడు. తాజాగా మరో గ్రాఫికల్ వండర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

ఏడేళ్ల క్రితం మరణించిన కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ హీరోగా ఓ సినిమాను రూపొందించాడు కోడి రామకృష్ణ. చనిపోయిన విష్ణువర్దన్ తెర మీద చూపించేందుకు. 450 మంది గ్రాఫిక్ ఆర్టిస్ట్లు రెండేళ్ల పాటు శ్రమించారు. సాండల్వుడ్ గ్లామర్ బ్యూటి రమ్య, సాయికుమార్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో గ్రాఫిక్స్, సాహస సింహ విష్ణువర్దన్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement