ప్రేమ కంటే లక్ష్యం ముద్దు | Kiss the target more than love | Sakshi
Sakshi News home page

ప్రేమ కంటే లక్ష్యం ముద్దు

Apr 30 2017 11:59 PM | Updated on Sep 5 2017 10:04 AM

ప్రేమ కంటే లక్ష్యం ముద్దు

ప్రేమ కంటే లక్ష్యం ముద్దు

ప్రేమ కంటే ప్రతి వ్యక్తికి లక్ష్యం ముఖ్యమనే కథాంశంతో ఎన్‌. రామస్వామి దర్శకత్వంలో స్మైల్‌ పిక్చర్స్‌ పతాకంపై వబ్బిన వెంకటరావు

ప్రేమ కంటే ప్రతి వ్యక్తికి లక్ష్యం ముఖ్యమనే కథాంశంతో ఎన్‌. రామస్వామి దర్శకత్వంలో స్మైల్‌ పిక్చర్స్‌ పతాకంపై వబ్బిన వెంకటరావు నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ‘అర్ధనారి’ ఫేమ్‌ అర్జున్, భరత్, పావని, సీమా చౌదరి హీరో హీరోయిన్లు. వీళ్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాపినీడు కెమేరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు అలీ క్లాప్‌ ఇచ్చారు.

దర్శక–రచయిత, నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ వారమే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. మా సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. మంచి విజయాన్ని సాధిస్తామని నమ్మకంగా ఉన్నా’’ అన్నారు నిర్మాత. పోలీస్‌ కావాలనుకునే యువకుడి పాత్రలో నటిస్తున్నట్టు అర్జున్‌ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: మల్లె శ్రీనివాసరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement