ప్రేమ కేరింత | Kerintha to release on 12th June | Sakshi
Sakshi News home page

ప్రేమ కేరింత

Jun 1 2015 10:37 PM | Updated on Sep 3 2017 3:03 AM

ప్రేమ కేరింత

ప్రేమ కేరింత

ఆరుగురి యువతీ యువకుల జీవితాల్లో జీవితంలో స్నేహం, ప్రేమ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేరింత’.

 ఆరుగురి యువతీ యువకుల  జీవితాల్లో జీవితంలో స్నేహం, ప్రేమ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేరింత’. అడవి సాయికిరణ్ దర్శకత్వంలో  సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్య తారలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం  ఈ నెల 12న విడుదల కానుంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘చాలా ఫ్రెష్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను  ఆకట్టుకునే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయనీ, రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించారనీ సంగీత దర్శకుడు మిక్కీ జే. మేయర్ అన్నారు. ఈ చిత్రానికి  కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, సహనిర్మాతలు: శిరీష్,లక్ష్మణ్.
 

Advertisement
 
Advertisement
Advertisement