మరోసారి ‘మహానటి’ పాత్రలో..!

Keerthy Suresh As Savitri In Ntr Biopic - Sakshi

అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో మహానటి పాత్రలో నటించిన కీర్తి సురేష్‌ నటనకు తెలుగు, తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. తెర మీద సావిత్రినే చూస్తున్నట్టుగా ఉందంటూ కీర్తించారు. అయితే ఇలాంటి గోల్డెన్‌ చాన్స్‌ కీర్తికి మరోసారి దక్కింది. మహానటి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి తెర మీద కనిపించనుందట.

నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ మరోసారి సావిత్రి పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే రానా, సుమంత్‌లు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top