ఎంట్రీతోనే ఇద్దరుగా..!

Keerthi Suresh Dual Role in Bollywood Debut Film - Sakshi

కొన్ని అవకాశాలు అందరికీ అందవు. వాటినే అరుదైన అవకాశాలు అంటాం. లక్కీగా నటి కీర్తీ సురేశ్‌కు అలాంటి అవకాశాలు ఆదిలోనే వరిస్తున్నాయి. కెరీర్‌ తొలి దశలోనే ఇళయదళపతి వంటి స్టార్‌ హీరోతో వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అసాధారణ నటనను ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో మరోసారి కథలో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది.

అంతేకాదు చాలా తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్‌ అవకాశాన్ని దక్కించుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. మరో విశేషం ఏమిటంటే తొలిసారిగా బాలీవుడ్‌లో నటిస్తున్న హిందీ చిత్రంలో కీర్తీసురేశ్‌ ద్విపాత్రాభినయం చేయబోతోందన్నది తాజా సమాచారం. ఈమె నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే అవుతుంది. దీనికి ఇంతకు ముందు బదాయ్‌ హో వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌దేవ్‌గన్‌ హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ రెండు విభిన్న పాత్రల్లో నటింబోతోందని తెలిసింది. అయితే మధ్య వయసు పాత్ర కోసం ఎలాంటి ప్రాస్థెటిక్‌ మేకప్‌ను వాడకుండా తన నటనతోనే వైవిధ్యాన్ని చూపిస్తానంటోంది. ఇది  భారతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, శిక్షకుడు సెయ్యద్‌ అబ్దుల్‌ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రం. దీన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top