
షోలో ఓ అనుకోని కంటెస్టెంట్ పాల్గొన్నాడు. ఆ కంటెస్టెంట్ అమితాబ్ ముఖంలో...
మామూలుగా రియాల్టీ షోలలో మనుషులు పాల్గొనటం పరిపాటి. కానీ, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ షోలో ఓ అనుకోని కంటెస్టెంట్ పాల్గొన్నాడు. ఆ కంటెస్టెంట్ అమితాబ్ ముఖంలో నవ్వులు పూయించాడు. ఇంతకూ ఆ కంటెస్టెంట్ ఎవరా!!.. అనుకుంటున్నారా?. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 11లో పాల్గొన్నది... ఓ పిల్లి. విషయమేంటంటే.. కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్‌లోకి గురువారం ఓ పిల్లి వచ్చింది. అది బిగ్‌బీ కాళ్లకు దగ్గరగా ఉన్న సెట్‌పైకి ఎక్కి కూర్చుంది! హాయిగా నిద్రపోయింది. అయితే ఈ విషయాన్ని‘‘ కేబీసీ ఆడటానికి వచ్చిందో పిల్లి.. ఫాస్టెస్ట్ ఫింగర్ వరకు వచ్చిందది.. ఆడలేక అక్కడే చతికిల బడిపోయింది’’ అంటూ బిగ్‌బీ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో పిల్లి చేష్టలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
T 3534 - 🤣🤣🤣
— Amitabh Bachchan (@SrBachchan) October 30, 2019
ऐ बिलौरी , बिल्ली बिल्ली , खेलन चली KBC
जैसे आइ Fastest Finger, लोट पोट हो गयी वहीं ~ अब pic.twitter.com/3pq49UfSXR

