22న తెరపైకి కార్గిల్‌ | Kargil Movie Release Om 22nd June | Sakshi
Sakshi News home page

22న తెరపైకి కార్గిల్‌

Jun 1 2018 8:39 AM | Updated on Jun 1 2018 8:39 AM

Kargil Movie Release Om 22nd June - Sakshi

కార్గిల్‌ చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: తమిళ సినిమా కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పవచ్చు. వినూత్న ప్రయోగాల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా ఒక సరికొత్త ప్రయోగాత్మక కథా చిత్రంగా కార్గిల్‌ను రూపొందించినట్లు ఆ చిత్రం శివాని సెంథిల్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 22న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒకే ఒక్క నటుడు నటించిన చిత్రం కార్గిల్‌ అని చెప్పారు. ఇందులో జిష్ణు అనే నటుడు హీరోగా నటించారని, ఇది ఒక కొత్త ప్రయోగం అని అన్నారు.

కార్గిల్‌ అనగానే దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధమే గుర్తుకొస్తుందని అన్నారు. అయితే మనిషి మానసిక ప్రేమ కూడా ఒక పోరాటమేనని అన్నారు. చెన్నై నుంచి బెంగళూర్‌కు కారులో పయనించే హీరోకు ఆయన ప్రేమకు ఏర్పడే మానసిక పోరాటమే కార్గిల్‌ చిత్రం అని తెలిపారు. ఒకే ఒక్కరు నటించారు అంటున్నారు, మరి ప్రేయసి అంటున్నారేమిటని అడగొచ్చని, అదే ఈ చిత్రంలో ట్విస్ట్‌ అని అన్నారు. ప్రేమలో నమ్మకం అనేది చాలా అవసరం అన్నారు.

అలాంటి నమ్మకమే ప్రేమను కలుపుతుందని చెప్పే చిత్రంగా కార్గిల్‌ ఉంటుందన్నారు. ఇది సరికొత్త ప్రయోగం అయినా పూర్తిగా ఎంటర్‌టెయినర్‌ చిత్రంగా ఉంటుందన్నారు. సెన్సార్‌ సభ్యులు చిత్రానికి యూ సర్టిఫికెట్‌ ఇచ్చి, కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని ప్రశంసించారని తెలిపారు. సుభ సెంథిల్‌ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్‌ బాయ్‌ సంగీతాన్ని, గణేశ్‌ పరమహంస ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement