ఐష్‌ కు ఇదే మొదటిసారి | Karan Johar enters Rs100 crore club; Aishwarya scores her first | Sakshi
Sakshi News home page

ఐష్‌ కు ఇదే మొదటిసారి

Nov 14 2016 11:49 AM | Updated on Sep 4 2017 8:05 PM

ఐష్‌ కు ఇదే మొదటిసారి

ఐష్‌ కు ఇదే మొదటిసారి

బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌, హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ తొలిసారిగా వంద కోట్ల క్లబ్‌ లో చేరారు.

ముంబై: ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌, హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తొలిసారిగా వంద కోట్ల క్లబ్‌ లో చేరారు. రెండో వారంలో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా వసూళ్లు రూ. 100 కోట్లు దాటాయి. అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 104.86 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లోనే రూ.73.42 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. కరణ్‌ జోహార్.. రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ దిల్ హై ముష్కిల్’లో రణబీర్‌ కపూర్‌, అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

రణబీర్‌ కపూర్‌ నటించిన సినిమాలు వందకోట్లు దాటడం ఇది మూడోసారి. యే జవానీ హై దీవానీ, బర్ఫీ ఇంతకుముందు వందకోట్లు వసూలు చేశాయి. అనుష్క శర్మ నాలుగోసారి ఈ ఘనత అందుకుంది. ఆమె నటించిన జబ్‌ తక్‌ హై జాన్‌, పీకే, సుల్తాన్‌ సినిమాలు భారీ కలెక్షన్లు సాధించాయి. ఐశ్వర్యరాయ్‌ నటించిన సినిమా వంద కోట్లు వసూలు చేయడం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement