పరిచయాలు లేకుండా పరిచయం అవుతున్నా

kannullo nee roopame released on june 29 - Sakshi

‘‘సినిమాల మీద ఉన్న ఆసక్తి, ఇష్టమే నన్ను యూకే నుంచి ఇక్కడికి తీసుకు వచ్చాయి. బిక్షపతి అనే పేరుని యూకేలో వాళ్లకు పలకడానికి రాకపోవడంతో బిక్స్‌గా మార్చుకున్నాను. అదే నా స్క్రీన్‌ నేమ్‌ అయింది’’ అన్నారు బిక్స్‌ ఇరుసడ్ల. నందు, తేజస్విని జంటగా బిక్స్‌ దర్శకత్వంలో భాస్కర్‌ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.  ఈ సందర్భంగా బిక్స్‌ మాట్లాడుతూ – ‘‘ఓ అందమైన ప్రేమ కథను హృదయానికి హత్తుకునేలా చెప్పాం.

ఎటువంటి కష్టంలో ఉన్నా లైఫ్‌ ముందుకు సాగాలి అనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పాం. నందు బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. తేజస్విని నటనలో పర్ణిపూర్ణత కనిపిస్తుంది. సంగీత దర్శకుడు సాకేత్‌ ఫస్ట్‌ సినిమా అయినా బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. మా సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకు వచ్చిన రామమోహనరావు ఇప్పిలి, శ్రీకాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తుండేవాణ్ణి. ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే డైరెక్టర్‌గా తొలి అడుగు వేసి, ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నా. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top