కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్! | Kangana Ranaut to play a 'chef' in Queen director, Vikas Bahl's next | Sakshi
Sakshi News home page

కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!

Nov 18 2015 11:34 PM | Updated on Sep 3 2017 12:40 PM

కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!

కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!

నిజంగా ఇదో చిత్రమైన కాంబినేషనే! కంగనా రనౌత్... బాలీవుడ్‌లో ఈ పేరు వినగానే విభిన్న తరహా పాత్రలు చేసే నటి గుర్తుకొస్తారు.

నిజంగా ఇదో చిత్రమైన కాంబినేషనే! కంగనా రనౌత్... బాలీవుడ్‌లో ఈ పేరు వినగానే విభిన్న తరహా పాత్రలు చేసే నటి గుర్తుకొస్తారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ పేరు వినగానే వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా మొదలైంది. పేరు - ‘రంగూన్’. గమ్మత్తేమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన క్రిష్ ‘కంచె’ సినిమా లాగే ఈ సినిమా కథ కూడా 1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలోనే నడుస్తుంది.

ఈ పీరియడ్ ఫిల్మ్‌లో షాహిద్ కపూర్, సయీఫ్ అలీ ఖాన్‌లు హీరోలు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన ఒక నటిగా కనిపించనుండడం విశేషం. నటిగా తనను తీర్చిదిద్దిన వ్యక్తితోనే ప్రేమలో పడే పాత్ర ఆమెది. ఇక సినిమాలో ముఖ్యమైన మూడో పాత్ర - ఒక సైనికుడిది.

గతంలో ‘ఓంకార’ సినిమాలో విశాల్ భరద్వాజ్‌తో కలసి పనిచేసిన షాహిద్ కపూర్‌కు అదే దర్శకుడితో ఇది రెండో సినిమా. ఎప్పటికప్పుడు పాత్రల్లో కొత్తదనం కోసం, అభినయంలో ఆత్మ సంతృప్తి కోసం వెతికే కంగనా రనౌత్ మరోసారి దుమ్ము రేపుతారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement