హిస్టారిక్‌ చిత్రానికి మరో కొత్త సమస్య

Kangana Ranaut  Said Sonu Sood Refused To Work Under A Woman - Sakshi

మ‌ణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాకు ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రం కాస్తా ఆలస్యమవుతూ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలని రీ షూట్‌ చేయాల్సి రావడం వల్ల ఆలస్యమవుతోంది. అయితే ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్‌’ సినిమాతో బిజీగా ఉండ‌డంతో.. కంగ‌నా అండ్‌ బ్యాచ్‌ రీ షూట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త వార్త వినిపిస్తోంది. అది ఏంటంటే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సోను సూద్‌, కంగనా గొడవపడ్డారని.. దాంతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు నిజమేనంటూ.. సోను సూద్‌ తప్పుకోవాడానికి గల కారణాన్ని బయటపెట్టారు కంగనా రనౌత్‌. దీని గురించి ఆమె ‘ప్రస్తుతం సోను సూద్‌ ‘మణికర్ణిక’ చిత్రంలో నటించడం లేదు. అతనిప్పుడు ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మేము ఈ పాచ్‌ వర్క్‌ గురించి అతనికి చెప్పా, మాతో సహకరించమని కోరాం. కానీ అతను నన్ను కలవడానికి నిరాకరించాడు. నేను తనని నా స్నేహితునిగానే భావించాను. అతను నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమా పాటలను నేనే లాంచ్‌ చేశాను. కానీ అతనికి అవేం గుర్తుకు లేవు’ అంటూ విమర్శించారు.

అంతేకాక తాను మహిళ అయినందున, తన డైరెక్షన్‌లో పనిచేయడానికి ఇష్టంలేకే సోను సూద్‌ షూటింగ్‌కి హాజరవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని కంగనా రనౌత్‌ తెలిపారు. అంతేకాక తన స్థానంలో మరొకరిని తీసుకొండని సలహ ఇచ్చాడన్నారు. దాంతో ప్రస్తుతం సోను సూద్‌కి సంబంధించిన సన్నివేశాలన్నింటిని మరో నటుడితో రీ షూట్‌ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇందుకోసం జీషన్‌ అయ్యూబ్‌ని సంప్రదించామని, అతను సెప్టెంబర్‌లో తమతో జాయిన్‌ అవుతాడని కంగనా తెలిపారు.

కంగనా వ్యాఖ్యలపై సోను సూద్‌ ప్రతినిధి స్పందించారు. ‘సోను సూద్‌ ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో ఆయనతో పనిచేసిన వారందరికి తెలుసు. ఆయన మణికర్ణిక చిత్రం కోసం ముందు ఒప్పుకున్న ప్రకారం షూటింగ్‌కి హాజరయ్యారు. కానీ ఇప్పుడు రీ షూట్‌కి కూడా రావాలని కోరారు. అయితే ప్రస్తుతం సోను సూద్‌ వేరే చిత్రంతో బిజీగా ఉన్నారు. అందువల్ల మణికర్ణిక కోసం డేట్స్‌ కేటాయించలేకపోతున్నారు. అందువల్లే మణికర్ణిక నుంచి తప్పుకున్నారు తప్ప మరో కారణం ఏం లేదు’ అంటూ తెలిపారు. అంతేకాక ‘మణికర్ణిక చిత్ర బృందానికి సోను సూద్‌ ఆల్‌ ది బెస్ట్‌ కూడా తెలిపారు’ అని వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top