అయ్యో అలాంటిదేమీ లేదు : కంగనా

Kangana Ranaut Clarifies Rumours - Sakshi

ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా మ‌ణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో హీరోయిన్ కంగనా రనౌత్‌కి, క్రిష్‌కి మధ్య విభేదాలంటూ గతకొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనికి తోడు చిత్రానికి సంబంధించిన‌ క్లాప్ బోర్డ్‌పై డైరెక్ట‌ర్ పేరుండాల్సిన దగ్గర కంగ‌నా ర‌నౌత్ పేరు ఉండ‌డంతో అభిమానుల్లో మరోసారి అనుమానం మొద‌లైంది. 

ఈ విష‌యంపై అభిమానులు ద‌ర్శ‌కుడితో పాటు కంగ‌నాని సోషల్‌మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించారు. దీంతో కంగ‌నా వెంట‌నే స్పందించింది. క్రిష్ తాను ఒప్పుకున్న వేరే సినిమాతో బిజీగా ఉండ‌డం వల్లే మేము ప్యాచ్ వ‌ర్క్‌పూర్తి చేశాం. అంతే కాని పూర్తి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేదు. సెట్లో ఉన్న క్లాప్ బోర్డ్ ఇంత గంద‌ర‌గోళం సృష్టించింది. ప్ర‌స్తుతం సినిమా వ‌ర్క్ అంతా స‌వ్యంగా జ‌రుగుతుంది. అనుకున్న స‌మ‌యానికే మూవీ రిలీజ్ అవుతుంది' అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బదులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మ‌ణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం జ‌న‌వ‌రి 25, 2019న‌ విడుద‌ల కానుందని కంగనా పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top