మూడు భాషల్లో ఒకేసారి అగ్రహీరో సినిమా | Kamal Haasan's next titled 'Sabaash Naidu' | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లో ఒకేసారి అగ్రహీరో సినిమా

Apr 29 2016 11:41 AM | Updated on Sep 3 2017 11:03 PM

మూడు భాషల్లో ఒకేసారి అగ్రహీరో సినిమా

మూడు భాషల్లో ఒకేసారి అగ్రహీరో సినిమా

విశ్వనాయకుడు కమల్‌హాసన్ త్వరలో మూడు భాషల్లో ఒకేసారి సినిమా తీయబోతున్నారు.

విశ్వనాయకుడు కమల్‌హాసన్ త్వరలో మూడు భాషల్లో ఒకేసారి సినిమా తీయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'శభాష్ నాయుడు', హిందీలో 'శభాష్ కుందు' అనే పేర్లతో ఈ సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన సినిమా లాంచింగ్ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాకు టీకే రాజీవ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌తో పాటు ఆయన కూతురు శ్రుతిహాసన్ కూడా ఈ సినిమాలో నటించడం మరో విశేషం.

విశ్వనాయకుడి సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా చేస్తుండగా, బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యపాత్రలో మెరుస్తారు. గతంలో 2008 సంవత్సరంలో కమల్ తీసిన దశావతారం సినిమాలో 'బలరాం నాయుడు' అనే సీబీఐ ఆఫీసర్ పాత్రను మళ్లీ ఇందులో పోషిస్తున్నారు. ఆయన అసిస్టెంట్‌గా బ్రహ్మానందం కనిపిస్తారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ మే రెండోవారం నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement