పాట పాడనున్న చందమామ | kajal sing a song for kannada movie chakravyuha | Sakshi
Sakshi News home page

పాట పాడనున్న చందమామ

Jan 7 2016 7:52 AM | Updated on Oct 30 2018 5:58 PM

పాట పాడనున్న చందమామ - Sakshi

పాట పాడనున్న చందమామ

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న అందాల భామ కాజల్ అగర్వాల్ తనలోని మరో టాలెంట్ చూపించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే హీరోయిన్గా తెలుగు తమిళ్తో పాటు హిందీలోనూ సత్తా...

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న అందాల భామ కాజల్ అగర్వాల్ తనలోని మరో టాలెంట్ చూపించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే హీరోయిన్గా తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ సత్తాచాటిన ఈ బ్యూటీ త్వరలోనే గాయని అవతారం ఎత్తనుంది. అది కూడా తనకు అస్సలు పరిచయం లేని ఓ కన్నడ సినిమాలో పాట పాడటానికి అంగీకరించింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా చక్రవ్యూహ కోసం కాజల్ గొంతు సవరించుకుంటోంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ పాట పాడాడు. పునీత్ రాజ్ కుమార్ 25వ సినిమా కావటం, పునీత్కు తెలుగు నటీనటులతో మంచి స్నేహం ఉండటంతో... ఇలా టాప్ స్టార్స్తో పాటలు పాడించి సినిమాకు మరింత ప్రచారం వచ్చేలా చేస్తున్నాడు తమన్. ప్రస్తుతానికి కన్నడంలో సింగర్గా కెరీర్ మొదలు పెడుతున్న కాజల్ ముందు ముందు తెలుగు సినిమాలో కూడా పాటలు పాడుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement