
ఎంత వరకు... ఈ ప్రేమ!
రీల్‌పై బోల్డన్ని ప్రేమకథల్లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ రియల్ లైఫ్‌లో మాత్రం ప్రేమలో పడటంలేదు. ఎందుకంటే ప్రేమలో పడేంత తీరిక లేదట.
రీల్‌పై బోల్డన్ని ప్రేమకథల్లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ రియల్ లైఫ్‌లో మాత్రం ప్రేమలో పడటంలేదు. ఎందుకంటే ప్రేమలో పడేంత తీరిక లేదట. అలాగే, మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడలేదట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం తను నటించిన ఓ ప్రేమకథా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘కవలై వేండామ్’ పేరుతో రూపొందిన ఈ తమిళ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి. వెంకటేశ్ తెలుగులోకి విడుదల చేస్తున్నారు.
‘రంగం’ ఫేమ్ జీవా హీరో. డి. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. జీవా, కాజల్‌ల కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్‌తో అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా దర్శకుడు డీకే తెరకెక్కించారు. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.