తొక్కేసిందిగా! | Kajal aggarwal in Queen Remake tamil version | Sakshi
Sakshi News home page

తొక్కేసిందిగా!

Dec 2 2017 8:49 AM | Updated on Oct 30 2018 5:58 PM

Kajal aggarwal in Queen Remake tamil version - Sakshi

కుడి వైపు తొక్కారు కాజల్‌ అగర్వాల్‌. ఎడమవైపు బ్యాలెన్స్‌ తప్పింది. వెంటనే ఎడమవైపు తొక్కారు. ఈసారి బ్యాలెన్స్‌ తప్పలేదు. కుడి, ఎడమలు కుదిరాయి. అంతే.. తొక్కేశారు. హలో గురూ.. కాజల్‌ ఎవర్నో తొక్కేసింది అనుకునేరు. తొక్కింది సైకిల్‌ని బాస్‌. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’ సినిమాను సౌత్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ముందు తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకరినే హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఫైనల్‌గా ఒక్కో లాంగ్వేజ్‌లో, ఒక్కో హీరోయిన్‌ సెట్‌ అయ్యారు. తమిళ క్వీన్‌ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో కాజల్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్‌లో నటించేందుకు ఫ్రాన్స్‌ వీధుల్లో కాజల్‌ సైకిల్‌ సవారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement