'గరుడ' నుంచి తప్పుకున్న కాజల్ | Kajal Agarwal out of Vikram Garuda | Sakshi
Sakshi News home page

'గరుడ' నుంచి తప్పుకున్న కాజల్

Jul 29 2016 12:45 PM | Updated on Oct 30 2018 5:58 PM

'గరుడ' నుంచి తప్పుకున్న కాజల్ - Sakshi

'గరుడ' నుంచి తప్పుకున్న కాజల్

అసలే సక్సెస్లు లేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చందమామ కాజల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ బడ్జెట్తో విక్రమ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమిళ మూవీ గరుడ నుంచి...

అసలే సక్సెస్లు లేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చందమామ కాజల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ బడ్జెట్తో విక్రమ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమిళ మూవీ గరుడ నుంచి తప్పకుంది ఈ ముద్దుగుమ్మ. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో విక్రమ్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని బాధ పడుతోంది.

గరుడ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నా.. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముగన్ ఆలస్య కావటంతో గరుడ షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో అదే సమయంలో అజిత్ సినిమాకు డేట్స్ ఇచ్చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విక్రమ్ సినిమా నుంచి కాజల్ తప్పకుంది. ప్రస్తుతం అజిత్ సినిమాతో పాటు తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న కాజల్, ఓ భారీ చిత్రం నుంచి తప్పకోవటం ఆమె కెరీర్ చాలా పెద్ద లాస్ అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement