దడ పుట్టిస్తా! | kajal act with lawrence | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తా!

May 11 2017 10:47 PM | Updated on Oct 30 2018 5:58 PM

దడ పుట్టిస్తా! - Sakshi

దడ పుట్టిస్తా!

‘దడ పుట్టిస్తా.. నీకు దడ పుట్టిస్తా..’ అనే పాట చాలామందికి గుర్తుండే ఉంటుంది.

‘దడ పుట్టిస్తా.. నీకు దడ పుట్టిస్తా..’ అనే పాట చాలామందికి గుర్తుండే ఉంటుంది. లారెన్స్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘డాన్‌’లోని పాట ఇది. మరి.. ఈ పాట మహత్యమో ఏమో అప్పటి నుంచి మొన్నటి ‘శివలింగ’ వరకూ లారెన్స్‌ నిజంగానే దడ పుట్టిస్తున్నారు . ముని, కాంచన, గంగ, శివలింగ... ఇలా వరుసగా హారర్‌ థ్రిల్లర్స్‌ చేసి, ప్రేక్షకులకు దడ పుట్టిస్తున్నారు.

ఈ చిత్రాలు వసూళ్ల సునామీతో బాక్సాఫీస్‌ని దడదడ లాడిస్తున్నాయి. ఇప్పుడు లారెన్స్‌ మరో హారర్‌ మూవీలో యాక్ట్‌ చేయబోతున్నారు. ఈ చిత్రంలో లారెన్స్‌తో కలిసి కాజల్‌ అగర్వాల్‌ కూడా దడ పుట్టించనున్నారట. ఇటీవల ‘జాగ్వార్‌’ని తెరకెక్కించి న దర్శకుడు మహాదేవ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఇప్పటివరకూ హారర్‌ చిత్రాల్లో నటించని కాజల్‌ ఈ చిత్రానికి అడగ్గానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని భోగట్టా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement