లారెన్స్‌తో కాజల్‌ సై అంటుందా? | kajal act with lawrence? | Sakshi
Sakshi News home page

లారెన్స్‌తో కాజల్‌ సై అంటుందా?

May 4 2017 1:38 AM | Updated on Sep 5 2017 10:19 AM

లారెన్స్‌తో కాజల్‌ సై అంటుందా?

లారెన్స్‌తో కాజల్‌ సై అంటుందా?

ఒక క్రేజీ కాంబినేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్‌ కోలీవుడ్‌లో స్ప్రెడ్‌ అవుతోంది. బాహుబలి–2 చిత్ర వాడివేడి ప్రపంచ

ఒక క్రేజీ కాంబినేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్‌ కోలీవుడ్‌లో స్ప్రెడ్‌ అవుతోంది. బాహుబలి–2 చిత్ర వాడివేడి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా బాహుబలి–2 చిత్రం మాటే. సరే ఈ చిత్రానికి లారెన్స్, కాజల్‌అగర్వాల్‌ల తాజా చిత్రానికి ఏమిటి సంబంధం అనేగా మీ సందేహం. బాహుబలి–2 చిత్ర సృష్టికర్త రాజమౌళి శిష్యుడు మెగాఫోన్‌ పట్టనున్నారన్నే తాజా సమాచారం. మొట్టశివ కెట్టశివ, శివలింగ చిత్రాల తరువాత నటుడు లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో ముని4 చిత్రాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉండగా రాజమౌళి శిష్యుడు చెప్పిన కథ నచ్చడంతో ముందు ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తున్నారట. కాగా ఇందులో లారెన్స్‌ సరసన నటి కాజల్‌ అగర్వాల్‌ను నాయకిగా ఎంపిక చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్‌. మరి ప్రస్తుతం అజిత్‌తో వివేగం, విజయ్‌ 61వ చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ లారెన్స్‌తో జత కట్టడానికి రెడీ అంటుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement