అవసరాలకు మంచి డేట్ దొరికింది | Jyo Achyutananda set for September 9th release | Sakshi
Sakshi News home page

అవసరాలకు మంచి డేట్ దొరికింది

Aug 25 2016 11:15 AM | Updated on Sep 4 2017 10:52 AM

అవసరాలకు మంచి డేట్ దొరికింది

అవసరాలకు మంచి డేట్ దొరికింది

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమా జ్యో అచ్యుతానంద. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా...

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమా జ్యో అచ్యుతానంద. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్న యూనిట్కు ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా కలిసొచ్చింది. ముందుగా ఈ సినిమాను భారీ పోటి మధ్య సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజు రిలీజ్ అవుతాయనుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా వెనక్కు తగ్గటంతో ఇప్పుడు జ్యో అచ్యుతానంద సోలోగా బరిలో నిలిచింది.

నాగచైతన్య ప్రేమమ్, నాని మజ్ను, సునీల్ వీడి గోల్డెహే సినిమాలు వాయిదా పడ్డాయి. నాగచైతన్య హీరోగా  తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో థియేటర్ల సంఖ్యతో పాటు తొలి వారం కలెక్షన్ల విషయంలోనూ జ్యో అచ్యుతానంద సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement