మతిపోగొట్టేలా రాయ్‌లక్ష్మీ | julie 2 trailor released | Sakshi
Sakshi News home page

మతిపోగొట్టేలా రాయ్‌లక్ష్మీ

Sep 4 2017 7:24 PM | Updated on Sep 17 2017 6:23 PM

మతిపోగొట్టేలా రాయ్‌లక్ష్మీ

మతిపోగొట్టేలా రాయ్‌లక్ష్మీ

హిందీ చిత్రం జూలీ-2లో నటి రాయ్‌ లక్ష్మీ విజృంభణ ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్‌ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న నటి రాయ్‌లక్ష్మీ.

చెన్నై : హిందీ చిత్రం జూలీ-2లో నటి రాయ్‌ లక్ష్మీ విజృంభణ ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్‌ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న నటి రాయ్‌లక్ష్మీ. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంవంటి దక్షిణాది భాషల్లో 50పైగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఏ భాషలోనూ హీరోయిన్‌గా సరైన స్థాయికి చేరుకోలేకపోయింది.

ఆ మధ్య తెలుగు చిత్రం ఖైదీ నంబర్‌ 150 చిత్రంలో ‘బాసూ చూపించు నీ గ్రేస్‌ ..అంటూ ఐటమ్‌ సాంగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నర్తించింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తోంది. ఎట్టకేలకు జూలీ -2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్ర ట్రైలర్‌ సోమవారం విడుదలయింది. అందులో రాయ్‌లక్ష్మీ కనిపించిన విధానం చూసి సినీ వర్గాలు విస్తుపోతున్నాయి. గ్లామర్‌ అనే పదానికి అర్ధాన్ని రాయ్‌లక్ష్మీ మార్చేసిందనే కామెంట్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement