ఇది దయాగాడి దండయాత్ర... | Jr.NTR Next Project With Vakkantham Vamsi | Sakshi
Sakshi News home page

ఇది దయాగాడి దండయాత్ర...

Jul 20 2016 12:03 AM | Updated on Sep 4 2017 5:19 AM

ఇది దయాగాడి దండయాత్ర...

ఇది దయాగాడి దండయాత్ర...

దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’ అంటూ ‘టెంపర్’ చూపించారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ నటనలో ఫైర్‌కు రెండున్నర గంటల తెరరూపమే

‘దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’ అంటూ ‘టెంపర్’ చూపించారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ నటనలో ఫైర్‌కు రెండున్నర గంటల తెరరూపమే ఈ ‘టెంపర్’ సినిమా. ఈ కథను రాసిన వక్కంతం వంశీ ఇంతకంటే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ను చూపించనున్నారు. విశేషం ఏంటంటే... ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించనున్నారు కూడా. ఎన్టీఆర్‌తో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించనున్నారు. దీని కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీ కూడా రెడీ చేస్తున్నారు.
 
  ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న, హీరో కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 2న ‘జనతా గ్యారేజ్’ విడుదలైన తర్వాత వక్కంతం వంశీ, ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. రచయితల్లో మంచి దర్శకులు కూడా ఉంటారని ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల శివ వంటి వాళ్లు నిరూపించారు. ఇప్పుడు వక్కంతం వంశీ కూడా దర్శకుడిగా మారనున్నారు. ఇప్పటివరకూ దర్శకులుగా కూడా సక్సెస్ అయిన రచయితల జాబితాలో వంశీ కూడా చేరతారని ఊహించవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement