వాస్తవ సంఘటనలతో జయహో | 'jayho 'movie is based on real story | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనలతో జయహో

Aug 18 2013 1:26 AM | Updated on Sep 4 2018 5:07 PM

వాస్తవ సంఘటనలతో  జయహో - Sakshi

వాస్తవ సంఘటనలతో జయహో

‘జగన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శివ నటిస్తున్న మలి చిత్రం ‘జయహో’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మహాగణపతి ఫిలింస్ పతాకంపై బాలశేఖరన్ దర్శకత్వంలో యం. సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీ చౌదరి కెమెరా స్విచాన్ చేయగా, డా.దాసరి క్లాప్ ఇచ్చారు

 ‘జగన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శివ నటిస్తున్న మలి చిత్రం ‘జయహో’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మహాగణపతి ఫిలింస్ పతాకంపై బాలశేఖరన్ దర్శకత్వంలో యం. సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీ చౌదరి కెమెరా స్విచాన్ చేయగా, డా.దాసరి క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చదువనేది వ్యాపారంగా మారిపోయింది. ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నాం’’ అన్నారు.
 
  ‘‘ఇందులో కాలేజ్ స్టూడెంట్‌గా నా పాత్రలో పలు ఎమోషన్స్ ఉంటాయి’’ అని శివ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా, అమ్మాయి బాగుందిలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆంధ్రా కాలేజ్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. మంచి పాత్రలు చేస్తున్నామని సందీప్, ప్రియాంక, అక్షిత, పరిణీతి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement