జాన్వీ షూ ఖరీదెంతో తెలుసా?

Janhvi Kapoor Pairs Rs 33K Tee With Rs 1.3 Lakh Shoes At The Airport - Sakshi

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన 'ధడక్' సినిమా పాజిటివ్ టాక్‌‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో జాన్వీతో పాటు కపూర్‌ ఫ్యామిలీ పట్టరానంత సంతోషంతో ఉంది. ఆమె ఈ మధ్య ఎక్కడ కనిపించినా.. సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.  తాజాగా జాన్వీ, సింగపూర్‌ నుంచి వస్తూ.. ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ఇక ఫోటోగ్రాఫర్లు వదిలిపెడతారా..? ఆమెను ఫోటోల మీద ఫోటోలు తీసి, మీడియా మాధ్యమాల్లో ప్రచురించాయి. అయితే ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న టీ-షర్ట్‌, షూ ఖరీదు వింటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.

ఆమె వేసుకున్న క్రీమ్‌ కలర్‌ కాటన్‌ జెర్సీ ఖరీదు రూ.33 వేలట. ఇది చిన్న స్లీవ్‌తో ఉన్న సెయింట్ లారెంట్ బాయ్‌ఫ్రెండ్‌ టీ-షర్టు. జాన్వీ టీ-షర్ట్‌తో పాటు ఆమె వేసుకున్న షూ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తెలుపు రంగుల్లో పింక్‌, బ్లూ రంగులో లెదర్‌ను కలిగి ఉన్న ఈ షూస్‌, దాదాపు 1.37 లక్షల రూపాయలట. జాన్వీ వేసుకున్న ఈ టీ-షర్ట్‌ను, షూను రెండింటినీ కూడా స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్‌ హౌజ్‌ బ్యాలెంసీగా నుంచి తెప్పించినవట. ఈ బ్రాండ్‌ ఫ్రెంచ్‌ మల్టినేషనల్‌ కంపెనీ కెరింగ్‌కు చెందినది. కాగ, ధడక్‌ మూవీ ప్రమోషన్స్‌ నుంచి ఆమె, స్టయిల్‌ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మరాఠి సినిమా సైరత్‌కు రీమేక్‌గా ధడక్‌ మూవీ బాలీవుడ్‌ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top