'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే | janatha garage, premam, mohenjodaro releasing on same date | Sakshi
Sakshi News home page

'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే

Jun 19 2016 8:51 AM | Updated on Sep 4 2017 2:53 AM

'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే

'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్.

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి.

ఆగస్టు 12న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు.

అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement