మరో ‘ఆనందం’తో పూర్వవైభవం? | jai rajesh act's in anandham | Sakshi
Sakshi News home page

మరో ‘ఆనందం’తో పూర్వవైభవం?

Nov 29 2014 1:05 AM | Updated on Sep 28 2018 4:53 PM

మరో ‘ఆనందం’తో పూర్వవైభవం? - Sakshi

మరో ‘ఆనందం’తో పూర్వవైభవం?

‘ఆనందం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్ మళ్లీ ఆ స్థాయి విజయాన్ని ఆశిస్తూ, చేసిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’.

‘ఆనందం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్ మళ్లీ ఆ స్థాయి విజయాన్ని ఆశిస్తూ, చేసిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. ‘ఆనందం’ సీక్వెల్‌గా ఆకాశ్ దర్శకత్వంలోనే ఎన్.జె. రత్నావత్ నిర్మించారు. మాజీ మిస్ ముంబయ్ ఏంజెల్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ -‘‘ఇటీవల చేసిన కొన్ని చిత్రాల వల్ల నా కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. ఈ చిత్రంతో నాకు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ, కుటుంబ సమేతంగా రూపొందించిన చక్కని ప్రేమకథ ఇది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement