ఒక్కరున్నా చాలు... | Jagapathi Babu Hithudu Movie Poster Launched | Sakshi
Sakshi News home page

ఒక్కరున్నా చాలు...

Apr 22 2015 12:15 AM | Updated on Sep 3 2017 12:38 AM

ఒక్కరున్నా చాలు...

ఒక్కరున్నా చాలు...

మన తోటి వారికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకుండా ఉంటే చాలనుకునే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది.

మన తోటి వారికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకుండా ఉంటే చాలనుకునే పరిస్థితి  ప్రస్తుతం సమాజంలో ఉంది. సాటి మనిషి బాగు కోరుకునే మనిషి ఒక్కరున్నా చాలు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హితుడు’. సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్వీ తనయుడు విప్లవ్ ఈ చిత్రానికి దర్శకుడు. జగపతిబాబు, మీరానందన్ ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వైవిధ్యమైన కథాకథనాలకు వాణిజ్య హంగులు జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, దర్శకుడు శివనాగేశ్వరరావు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement