స్క్రీన్‌ప్లే అదిరిందని అభినందిస్తున్నారు | Jagannatakam is a screenplay based flick | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ప్లే అదిరిందని అభినందిస్తున్నారు

Mar 14 2015 11:04 PM | Updated on Mar 22 2019 5:33 PM

స్క్రీన్‌ప్లే అదిరిందని అభినందిస్తున్నారు - Sakshi

స్క్రీన్‌ప్లే అదిరిందని అభినందిస్తున్నారు

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల వీరాభిమానిని నేను. ఆ ప్రేరణతో నటుడు కావాలని వచ్చా. కానీ దర్శకునిగా మారా.

 ‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల వీరాభిమానిని నేను. ఆ ప్రేరణతో నటుడు కావాలని వచ్చా. కానీ దర్శకునిగా మారా. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌లకు సరిపోయే కథలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికైనా వాళ్లతో ఓ సినిమా చేస్తా’’ అని ప్రదీప్ నందన్ చెప్పారు. ప్రదీప్ హీరోగా, దర్శకునిగా ఆదిశేషారెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాటకం’ ఇటీవలే విడుదలైంది. తన నటనకు, దర్శకత్వానికి మంచి కితాబులు లభిస్తున్నాయని ప్రదీప్ నందన్ చెబుతూ -‘‘ ‘ప్రయాణం’కు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశా.
 
 చాలా విభిన్నమైన కథాంశంతో ‘జగన్నాటకం’ డెరైక్ట్ చేశా. చాలా మందికి ఈ సినిమా బాగా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే అదిరిందని అందరూ అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా థ్రిల్ ఫీలయ్యామని చెబుతున్నారు. నా డైరక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అయితే టైటిల్ మోడరన్‌గా పెట్టుంటే ఇంకా బాగుండేదని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ దీనికి ‘జగన్నాటకం’ టైటిలే యాప్ట్. త్వరలో డబ్బు నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement