అతడు నా కుమారుడితో సమానం.. | Jackie Shroff Responds On Working With Salman Khan | Sakshi
Sakshi News home page

అతడు నా కుమారుడితో సమానం..

Mar 26 2019 6:12 PM | Updated on Apr 3 2019 6:34 PM

Jackie Shroff Responds On Working With Salman Khan - Sakshi

సల్మాన్‌తో అనుబంధంపై స్పందించిన జాకీ ష్రాఫ్‌

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన కంటే చాలా చిన్న వయసు హీరోయిన్లతోనూ ఆన్‌స్ర్కీన్‌ రొమాన్స్‌ పండించడంలో ముందుంటారు. తరాల అంతరాలు అధిగమించి నటనతో ఆకట్టుకుంటారు. తాజాగా భారత్‌ మూవీలో తనకంటే కేవలం పదేళ్లు పెద్దయిన జాకీ ష్రాఫ్‌కు కొడుకుగా సల్మాన్‌ నటిస్తున్నారు. సల్మాన్‌, తాను దాదాపు ఒకే సమయంలో కెరీర్‌ను ప్రారంభించామని తమ మధ్య పదేళ్ల వయసు అంతరం ఉన్నా కండలవీరుడి తండ్రిగా నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని జాకీ ష్రాఫ్‌ చెప్పుకొచ్చారు.

సల్మాన్‌ను తానెప్పుడూ తన కుమారుడిగానే భావించానని, ఇప్పటికీ అతను తనకు చిన్నపిల్లాడేనని అన్నారు. తమ కెరీర్‌ తొలినాళ్లలో తాను ధరించే జీన్స్‌, షూస్‌ను సల్మాన్‌ ఎంతో ఇష్టపడేవాడని గుర్తుచేసుకున్నారు. భారత్‌ మూవీలో సల్మాన్‌ ఖాన్‌, జాకీ ష్రాఫ్‌తో పాటు దిశా పటానీ, టబు, నోరా ఫతేహి, కత్రినా కైఫ్‌, సునీల్‌ గోవర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement