స్వచ్ఛమైన ప్రేమకథ! | Its My Love Story new moive | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమకథ!

Mar 9 2016 11:00 PM | Updated on Sep 3 2017 7:21 PM

స్వచ్ఛమైన ప్రేమకథ!

స్వచ్ఛమైన ప్రేమకథ!

నేను దర్శకత్వం వహించిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి వినోద్ అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ట్రైలర్ బాగుంది. డైలాగులు కొత్తగా ఉన్నాయి.

  ‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి వినోద్ అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ట్రైలర్ బాగుంది. డైలాగులు కొత్తగా ఉన్నాయి. పూర్తి స్థాయి లవ్‌స్టోరీగా చేసిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శక-నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాయి రోనక్, అదితీ సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’.

 ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈశాన్య భారతదేశ నేపథ్యం ఉంటుంది’’ అని తెలిపారు. ఈ వేడుకలో హీరో హీరోయిన్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని లింగాల తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement