అప్పట్లో మా ఇద్దరి మధ్య యుద్ధమే! | It was a war with Stallone, says Arnold Schwarzenegger | Sakshi
Sakshi News home page

అప్పట్లో మా ఇద్దరి మధ్య యుద్ధమే!

Nov 22 2014 2:16 PM | Updated on Sep 2 2017 4:56 PM

అప్పట్లో మా ఇద్దరి మధ్య యుద్ధమే!

అప్పట్లో మా ఇద్దరి మధ్య యుద్ధమే!

ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్, సిల్వస్టర్ స్టాలోన్ ఇద్దరూ ఒకే సమయంలో భారీ యాక్షన్ చిత్రాలు చేశారు. తామిద్దరి మధ్య యుద్ధవాతావరణమే ఉండేదని ష్వాజ్ నెగర్ అన్నారు.

ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్, సిల్వస్టర్ స్టాలోన్ ఇద్దరూ ఒకే సమయంలో భారీ యాక్షన్ చిత్రాలు చేశారు. దాదాపు ఒక దశాబ్దం పాటు ఇద్దరి చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యేవి. ఫస్ట్బ్లడ్, రాంబో లాంటి చిత్రాలతో సిల్వస్టర్ స్టాలోన్, క్లిఫ్హాంగర్ లాంటి సినిమాలతో ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ ప్రేక్షకులకు ఉత్కంఠ రేకెత్తించేవారు. 1980లలో అయితే తామిద్దరి మధ్య దాదాపు యుద్ధాలే జరిగేవని, ఎవరికి ఎక్కువ కండలున్నాయి.. ఎవరి శరీరంలో కొవ్వు తక్కువగా ఉంది, వెండితెరమీద ఎవరు ఎక్కువమందిని చంపారు.. ఇలా అన్ని విషయాల్లో తమ మధ్య పోటీ తీవ్రంగా ఉండేదని ష్వాజ్నెగర్ చెప్పారు.

దాదాపు దశాబ్ద కాలంపాటు స్టాలోన్ను తాను విపరీతంగా ద్వేషించానన్నారు. ఓ జాతీయ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన ఆయన తన మనసులో భావాలను పంచుకున్నారు. ఆ తర్వాత.. అంటే, 1990ల ప్రారంభంలో తాము స్నేహితులం అయ్యామన్నారు. అప్పటికి ఇద్దరిలోనూ తగినంత పరిపక్వత రావడంతో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. ఎస్కేప్ ప్లాన్, ద ఎక్స్పెండబుల్స్ లాంటి చిత్రాల్లో అయితే ఇద్దరూ కలిసి కూడా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement