రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో అప్డేట్..! | Intresting UPdate On Rajamouli Next | Sakshi
Sakshi News home page

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో అప్డేట్..!

Apr 18 2017 3:20 PM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో అప్డేట్..! - Sakshi

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో అప్డేట్..!

బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి, తరువాత చేయబోయే సినిమాపై రకరకాల

బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి, తరువాత చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి భారీగా మహాభారత గాథను తెరకెక్కిస్తాడన్న ప్రచారం జరిగినా.. రాజమౌళి, ఆ వార్తలను ఖండించాడు. ఆ తరువాత రాజమౌళి నెక్ట్స్ సినిమా హీరో.. అంటూ చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. ఈ లిస్ట్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలు కూడా ఉన్నారు. ప్రముఖంగా ఎన్టీఆర్తో రాజమౌళి సినిమా ఉంటుదన్న టాక్ బలంగా వినిపించింది.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. బాహుబలి సినిమాకు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్న కరణ్ జోహర్ తొలి భాగం రిలీజ్ తరువాత ప్రభాస్ను ఓ బాలీవుడ్ సినిమా చేయమని అడిగాడట. ప్రభాస్ కూడా స్ట్రయిట్ హిందీ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుండటంతో ఆ సినిమాను రాజమౌళి దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్నాడు కరణ్.

ప్రభాస్ ఇప్పటికే సుజిత్ సినిమాను స్టార్ చేసేశాడు. అంటే రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. మరి అప్పటి వరకు రాజమౌళి వెయిట్ చేస్తాడా.. లేక మరో హీరోతో సినిమా చేసి ప్రభాస్ హిందీ ప్రాజెక్ట్ను తరువాత చేస్తాడా.? అన్న విషయం తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement