ఇట్స్‌ వెయిటింగ్‌ టైమ్‌

Interesting Facts About Prabhas Sahoo - Sakshi

రావడంలేదు.. ఈ ఏడాది ప్రభాస్‌ సిల్వర్‌ స్క్రీన్‌కి రావడంలేదు. టూ  పార్ట్స్‌గా వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ కోసం ప్రభాస్‌ ఫైవ్‌ ఇయర్స్‌ టైమ్‌ కేటాయించి.. ఐదేళ్లలో రెండుసార్లు మాత్రమే సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘సాహో’ టీజర్‌ను ‘బాహుబలి 2’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందు విడుదల చేశారు. ‘ఇన్‌ థియేటర్స్‌ 2018’ అని టీజర్‌ ఎండ్‌ అవుతుంది. అలాగే ఆ టీజర్‌లో ‘ఇట్స్‌ షో టైమ్‌’ అని ప్రభాస్‌ డైలాగ్‌ చెబుతారు. ఈ ఏడాది వెండితెరపై ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ను చూడొచ్చనుకున్నారు సినీ ప్రేమికులు. కానీ ‘సాహో’ చిత్రం ఈ ఏడాది విడుదల కావడం లేదని దాదాపు కన్ఫార్మ్‌ అయినట్టే. సో.. ‘ఇట్స్‌ వెయిటింగ్‌ టైమ్‌’ అన్నమాట. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. అరుణ్‌ విజయ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, మందిరా బేడీ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను టీ సీరీస్‌ అధినేత, నిర్మాత భూషణ్‌ కుమార్‌ రిలీజ్‌ చేయనున్నారు. ‘సాహో’ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చేది నెక్ట్స్‌ ఇయరే అని బీ టౌన్‌ స్ట్రాంగ్‌ టాక్‌. ‘సాహో’కి బోలెడంత సీజీ వర్క్‌ ఉంటుందని టీజర్‌ ఎండ్‌ షాట్స్‌ చూస్తే అర్థం అవుతుంది. సో.. ఈ ఏడాది ప్రభాస్‌ థియేటర్స్‌లోకి రావడం కష్టమే. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్‌ అబుదాబీలో జరుగుతోంది. ‘‘అబుదాబిలో జరుగుతున్న ‘సాహో’ షూటింగ్‌లో పాల్గొన్నాను’’ అని పేర్కొన్నారు నీల్‌ నితిన్‌ ముఖేష్‌. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top