ఒంటరి జీవితం గడుపుతున్న టీవీ స్టార్ | I'm a loner: Khloe Kardashian | Sakshi
Sakshi News home page

ఒంటరి జీవితం గడుపుతున్న టీవీ స్టార్

Jun 15 2016 10:28 AM | Updated on Sep 4 2017 2:33 AM

ఒంటరి జీవితం గడుపుతున్న టీవీ స్టార్

ఒంటరి జీవితం గడుపుతున్న టీవీ స్టార్

తానిప్పుడు ఒంటరినని రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ పేర్కొంది.

లాస్ ఏంజెలెస్: తానిప్పుడు ఒంటరినని రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ పేర్కొంది. ఒంటరి జీవితం బాగుందని ఆమె తెలిపింది. తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ నుంచి ఆమె విడిపోయింది. కర్దాషియన్ తమ్ముడు రాబ్‌.. బ్లాక్ చెనాను పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టడంతో ఆమె ఒంటరిదైంది.

'ఒంటరి జీవితం నాకెంతో ఇష్టం. ఎందుకంటే సహజంగా నాది ఒంటరి స్వభావం. నాకు నచ్చినట్టుగా సమయం గడుపుతున్నాను. ఇంతకుముందు నా ఇల్లు చాలా సందడిగా ఉండేది. నా తమ్ముడు వెళ్లిపోయిన తర్వాత ఇల్లంతా ఖాళీగా ఉంది. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను. నాకు నేనుగా బయటకు రావాలని, అందర్నీ కలవాలని అనుకుంటున్నా'నని బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.

తన తమ్ముడు దూరమైనందుకు బాధగా ఉందని చెప్పింది. 'రాబ్, నేను కలిసి సినిమాలు, టీవీ చూసేవాళ్లం. కలిసి భోజనం చేసేవాళ్లం. రోజులో జరిగిన విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లం. ఇలాంటివన్నీ కోల్పోయాను. ఒంటరితనాన్ని జయించేందుకు సంగీతం వింటున్నాన'ని కర్దాషియన్ వెల్లడించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement